ప్రతి గింజ కొనుగోలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
ప్రతి గింజ కొనుగోలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
Collector


యాదాద్రి భువనగిరి, 18 జూన్ (హి.స.)

రైతుల వరి ధాన్యం చివరి గింజ వరకు అత్యంత వేగంగా కొనుగోళ్లు పూర్తి చేస్తామని మండల స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేసి ప్రమీల రైతులకు భరోసానిచ్చారు.

గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ఆమె మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పరిధాన్యం కొనుగోలు కేంద్రం, మోడల్ స్కూల్, కేజీబీవీలను సందర్శించారు.

మోడల్ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను ఆమె పరిశీలించి ప్రస్తుత ఉన్న విద్యార్థుల సంఖ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్కూలు ప్రారంభమై నాలుగు రోజులు అవుతుండడంతో విద్యార్థుల హాజరు సంఖ్య తక్కువగా ఉండడం గమనించారు. అనంతరం కేజీబీవీలో కూడా విద్యార్థులు హాజరు శాతం తక్కువగానే నమోదు కావడంతో మరోసారి పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యాక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు. అందుబాటులో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ... మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట నాయబ్ తాహసీల్దార్ మమత, స్థానిక మండల విద్యాధికారి గోలి శ్రీనివాసులు, స్థానిక ఆర్ ఐ జుబేరుద్దీన్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శివరంజని తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande