ఎస్సీ హాస్టళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ భారీ ధర్నా..
ఎస్సీ హాస్టళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ భారీ ధర్నా..
aisf-protest-in-anantapur-over-sc-hostel-problems


ఎస్సీ హాస్టళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని  ఏఐఎస్ఎఫ్ భారీ ధర్నా..


అనంతపురం, 18 జూన్ (హి.స.)అనంతపురం జిల్లాలోని ఎస్సి హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి హెచ్చరించారు.

అనంతపురం నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు భారీ ధర్నా నిర్వహించారు.

హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.జిల్లా జైలులో ఉన్న ఖైదీల మెనూ కోసం కేటాయిస్తున్న బడ్జెట్లో సగం కూడా విద్యా రంగానికి, హాస్టల్ విద్యార్థుల మెనూ కోసం కేటాయించడం లేదు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది.

విద్యార్థుల మెనూ బడ్జెట్పై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande