తిరుచానూరులో కాశీ మఠాధిపతి సందడి.. అమ్మవారి సేవలో స్వామీజీ!
తిరుచానూరులో కాశీ మఠాధిపతి సందడి.. అమ్మవారి సేవలో స్వామీజీ!
తిరుచానూరులో కాశీ మఠాధిపతి సందడి.. అమ్మవారి సేవలో స్వామీజీ!


తిరుచానూరు, 18 జూన్ (హి.స.)తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కాశీ మఠాధిపతి శ్రీమద్ సంయమీంద్ర తీర్థ స్వామీజీ కి చిన్న మర్యాదతో ఘన స్వాగతం లభించింది.

ముందుగా ఆలయానికి చేరుకున్న మఠాధిపతికి ఆలయ అధికారులు, అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి మఠాధిపతి మ్రోక్కుల తీర్చుకున్న అనంతరం మూల మూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు శేష వస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ సురేష్, అర్చకులు బాబుస్వామి, వేంపల్లి శ్రీనివాసులుస్వామి ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, చలపతి ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande