
అమరావతి, 19 జూన్ (హి.స.)అదృశ్యమైన సాయికృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయడానికి నియమితులైన దర్యాప్తు అధికారి నరసింహ కిశోర్ నేడు విజయవాడకు చేరుకోనున్నారు.
సాయికృష్ణ అదృశ్య ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించనున్న దర్యాప్తు అధికారి, ముందుగా రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ను కలవనున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ను సందర్శించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ