
అమరావతి, 19 జూన్ (హి.స.), కోల్కతాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(శుక్రవారం) ఉదయం ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరారు. వీసా స్టీల్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్లతో లోకేశ్ భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, విధానాలను ప్రశంసించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ