
హైదరాబాద్, 19 జూన్ (హి.స.)
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్కు
నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఈ నోటీసులు అందాయి. ఈ నెల 22వ తేదీ (సోమవారం) నాడు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద ఘటనపై సమగ్ర విచారణ జరిపిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు దాఖలు చేసిన ఈ ఛార్జ్ షీట్లో నటుడు అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా (A11) చేర్చారు. కాగా, ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని వరుసగా A1 నుంచి A10 వరకు నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
మరో 19 మందికి సమన్లు..
పోలీసులు దాఖలు చేసిన ఛార్జీషీట్ను పరిశీలించిన నాంపల్లి కోర్టు.. తాజాగా అల్లు అర్జున్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 19 మందికి నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు