
హైదరాబాద్, 19 జూన్ (హి.స.)కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురదేశ్వర్కు ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను కుంట వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శుక్రవారం నుంచే ఇది అమల్లోకి రానుందని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. అయితే, 12789/12790 రైళ్లు కాచిగూడ-మంగళూరు మధ్య సూపర్ఫాస్ట్గా, అక్కడి నుంచి కుంట వరకు నాన్ సూపర్ఫాస్ట్గా నడుస్తాయని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్