పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి.. నిర్మల్ జిల్లా కలెక్టర్
పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి.. నిర్మల్ జిల్లా కలెక్టర్
Collector


నిర్మల్, 19 జూన్ (హి.స.) నిర్మల్ జిల్లా

దిలావర్పూర్ మండల కేంద్రంలో

ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల లో వసతి, విద్యా బోధన,పారిశుద్ధ్యం, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థినిలతో నేరుగా మాట్లాడి పారిశుద్ధ్యం విద్యా బోధన తిరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు మనపై నమ్మకం తో ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారని వారు నమ్మినట్టుగానే ఉత్తమ విద్యను అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులను కోరారు. వర్షాకాలం ప్రారంభమైనందువలన ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో భోజన్న, తహసీల్దార్ అజిజ్ అహ్మద్ ఖాన్,ఎంఈఓ సదానందం,పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు అపర్ణ నాయకులు పి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande