ఎస్పీ కార్యాలయం కోసం తీసుకున్న హాస్టల్ తిరిగి విద్యార్థులకే అప్పగించాలి
ఎస్పీ కార్యాలయం కోసం తీసుకున్న హాస్టల్ తిరిగి విద్యార్థులకే అప్పగించాలి
ఎస్పీ కార్యాలయం కోసం తీసుకున్న హాస్టల్  తిరిగి విద్యార్థులకే అప్పగించాలి


రాయచోటి, 19 జూన్ (హి.స.) అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిరాయచోటి నీ ప్రకటించినప్పుడు ఎస్పీ కార్యాలయం కోసం పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనాలను తాత్కాలికంగా ఎస్పీ కార్యాలయం కోసం ఇచ్చారని దీనిని తిరిగి విద్యార్థుల వసతి గృహానికే వినియోగించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా స్థానిక రాయచోటి పట్టణం తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం ఈ రోజు ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి పట్టణం నందు గల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ కళాశాల విద్యార్థులకు వసతి గృహ భవనమును నిర్మించడం జరిగింది అని వారు అన్నారు.

హాస్టల్ భవనం ను నిర్మించిన తర్వాత వివిధ జిల్లాల నుండి వందలాదిమంది విద్యార్థులు ఆ కళాశాలలో చదువుకుంటూ వసతిగృహంలో ఉండేవారని భోజనం మరియు ఇతర మౌలిక సౌకర్యాలు ఆ విద్యార్థులకు అందెవని వారు అన్నారు.

అయితే గత వైసిపి ప్రభుత్వ హయాంలో నూతన జిల్లాల ప్రకటనలో భాగంగా ( 2021) లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు.

రాయచోటి ప్రాంతం జిల్లా కేంద్రం కావడంతో జిల్లా కార్యాలయాల ఏర్పాటు లో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయ నిర్వహణ కొరకు పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులకు మరియు సిబ్బందికి సమ్మతం లేకుండా కూడా జిల్లా అభివృద్ధికి దోహదపడాలని నిర్ణయంతో వసతి గృహ భవనమును ఎస్పీ గారి కార్యాలయ నిర్వహణకు ఇవ్వడం జరిగిందన్నారు.

హాస్టల్ భవనమును ఎస్పీ కార్యాలయానికి ఇచ్చిన తర్వాత కళాశాల విద్యార్థులు పట్టణంలో ఉన్నటువంటి బిసి ఎస్సి హాస్టల్స్ లో ఉంటూ 6 కిలోమీటర్ల మేర బస్సులలో ఆటోలలో ప్రయాణం చేసి ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం తిరిగి హాస్టల్ కు వెళ్లి తిని రావడానికి వీలు లేక ఉదయం చేసిన భోజనాన్నే తీసుకొని వచ్చి మధ్యాహ్నం తిని తిరిగి మళ్ళీ హాస్టల్స్ కి వెళ్లే పరిస్థితి వారికి నెలకొని ఉందని వారు మండిపడ్డారు.

అంతేకాకుండా ప్రభుత్వ హాస్టల్స్ లో సీట్లు దొరకక ప్రైవేట్ హాస్టల్స్ లో నాలుగు వేల నుండి 5వేల రూపాయల వరకు డబ్బులు కట్టి వారు ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande