విద్యార్థులకు బిగ్ అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
Students


కర్నూలు, 19 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్లైన్ వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మే 25 నుంచి జూన్ 4 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.

ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు https://www.results.manabadi.co.in/2026/AP/SSC-SUP/mobile/AP-SSC-Supply-2026-Results-18062026.htm ఈ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ను వెంటనే తెలుసుకోవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande