రైతుగా మారిన ఆదోని ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి
రైతుగా మారిన ఆదోని ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి
డా. పీవీ పార్థసారథి


ఆదోని, 19 జూన్ (హి.స.)

ఆదోని నియోజకవర్గంలోని డాణాపురం గ్రామంలో శాసనసభ్యులు డా. పీవీ పార్థసారథి వాల్మీకి రైతుగా మారి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు.

పొలంలోకి స్వయంగా దిగి రైతులతో కలిసి సాలు పట్టి విత్తనాలు నాటి వ్యవసాయం పట్ల తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అన్నదాత కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. వ్యవసాయం మన సంస్కృతికి మూలాధారమని, రైతు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande