యోగా సాధనతో. రాందేవ్. బాబా అద్భుతాలు.సృష్టిస్తున్నారు
యోగా సాధనతో. రాందేవ్. బాబా అద్భుతాలు.సృష్టిస్తున్నారు
యోగా సాధనతో. రాందేవ్. బాబా అద్భుతాలు.సృష్టిస్తున్నారు


అమరావతి, 20 జూన్ (హి.స.)

, యోగా సాధనతో బాబారామ్దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లి గుహల దగ్గర యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. బాబారామ్దేవ్తో కలిసి సీఎం యోగా సాధన చేశారు. రామ్దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బాబారామ్దేవ్ ఏదైనా చేయగలరన్నారు. యోగాకు.. రామ్దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందని సీఎం అన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఏపీ మారనుందని పేర్కొన్నారు. ఉండవల్లి కొండల వద్ద యోగా.. చాలా అందమైన ఆలోచన అని అన్నారు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ను ఒప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande