ఘరానా దొంగను బాలాపూర్ కి తరలించిన పోలీసులు
ఘరానా దొంగను బాలాపూర్ కి తరలించిన పోలీసులు
ఘరానా దొంగను బాలాపూర్ కి తరలించిన పోలీసులు


హైదరాబాద్, 20 జూన్ (హి.స.)

ఘరానా దొంగను బాలాపూర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్ ఆన్లైన్ కాలనీలో నివసించే మహ్మద్ జహంగీర్ కుమారుడు సలీం(52) అలియాస్ సునీల్షెట్టి, ఇబ్రహీం, షెట్టి సలీం నూతన గృహాలకు రంగులు వేసే కార్మికుడు. నగరంలో ఎక్కడ పనిదొరికినా అక్కడే ఉంటూ చేస్తాడు. చీకటి పడితే చాలు తాళం వేసి ఉన్న ఇళ్లైనా.. లేదా మనుషులు ఉన్నా జాగ్రత్తగా చోరీ చేస్తాడు. నగరంలో ఇప్పటివరకు 78 దొంగతనాలు చేశాడు. పలుచోట్ల పట్టుబడి కటకటాల పాలయ్యాడు. జైలు నుంచి తిరిగొచ్చాక.. నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటిస్తాడు. వారం రోజుల క్రితం ఆన్లైన్ కాలనీలో ఓ ఇంట్లో బంగారు అభరణాల చోరీ చేశాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన వారు సీసీ కెమెరాల ఆధారంగా పాత నేరస్థుడు సలీంను పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకొన్నాడు. పోలీసులు శుక్రవారం నిందితుడిని రిమాండ్ చేశారు. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande