
ఆనందపురం, 20 జూన్ (హి.స.)
: విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామం నుంచి పెద్దిపాలెం గ్రామం వరకు 16వ నంబరు జాతీయ రహదారి, సర్వీస్ రోడ్డును కలుపుతూ నిర్మించనున్న బీటీ రోడ్డుకు శనివారం శంకుస్థాపన చేశారు. సుమారు 1.5 కిలోమీటర్ల రోడ్డును జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 45 లక్షల వ్యయంతో పనులను చేపట్టినట్లు ఇంజినీరింగ్ విభాగం ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మాజీ వైస్ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా గ్రామస్థులు మట్టి రోడ్డుతో ఇబ్బంది పడుతున్నారని, బీటీ రోడ్ నిర్మిస్తే రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ