అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పురస్కరించుకొని అరకులోయ మాదగడ వద్ద యోగా కార్యక్రమం
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పురస్కరించుకొని అరకులోయ మాదగడ వద్ద యోగా కార్యక్రమం
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పురస్కరించుకొని అరకులోయ మాదగడ వద్ద యోగా కార్యక్రమం


అమరావతి, 20 జూన్ (హి.స.)

అరకులోయ పట్టణం: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకులోయలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మాడగడ మేఘాల కొండపై అల్లూరి జిల్లా అధికార యంత్రాంగం ‘యోగాంధ్ర సన్నాహాక’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మంది పాల్గొన్నారు. ప్రకృతి సోయగాల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యోగా నిపుణులు హాజరై పలువురితో యోగాసనాలు వేయించారు. జిల్లా కలెక్టర్ నిశాంతి టి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులతో మేఘాల కొండపై సందడి వాతావరణం నెలకొంది. ప్రజలతో కలిసి ప్రకృతిలో యోగా సాధన చేయడం ఆనందంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. గతేడాది అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి గిన్నిస్ బుక్ స్థాయిలో గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం అని పలువురు వక్తలు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande