
తిరుపతి , 20 జూన్ (హి.స.)
పీక్యూఆర్ఎస్ (పట్టాలు త్వరగా మార్చే సెమీ మెకనైజడ్ టెక్నాలజీ) పనుల కోసం వచ్చేనెల 13వ తేదీ వరకు శుక్ర, సోమవారాల్లో తిరుపతి-కాట్పాడి మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. 22, 26, 29, జూలై 3, 6, 10, 13 తేదీల్లో 16854/53 లోకల్ ట్రైన్ను పాక్షికంగా రద్దు చేశారు.
ఈనెల 22, 26, 29, జూలై 3, 6, 10, 13 తేదీల్లో 67205, 67210, 67207, 67208 నెంబర్లు గల లోకల్ ట్రైన్ను పూర్తిగా రద్దు చేశారు. 25న, జూలై 2, 9న చర్లపల్లి-తిరువనంతపురం(07001)ప్రత్యేక రైలును దారి మళ్లించి రేణిగుంట నుంచి మేల్పాకం, కాట్పాడి మీదుగా నడుపుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ