రెవెన్యూ అధికారులపై దాడిని ఖండిస్తూ ఆదిభట్ల సర్కిల్ అధికారుల నిరసన
రెవెన్యూ అధికారులపై దాడిని ఖండిస్తూ ఆదిభట్ల సర్కిల్ అధికారుల నిరసన
Adibatla


హైదరాబాద్, 20 జూన్ (హి.స.)

తుర్కఁంజాల్లో విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ శనివారం ఆదిభట్ల సర్కిల్-15, శంషాబాద్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు బ్లాక్ బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తుర్కయంజాల్ ప్రాంతంలో భూ వివాదానికి సంబంధించిన విధుల నిర్వహణ కోసం వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి చేయడం అత్యంత ఖండనీయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్భయంగా నిర్వహించేలా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, బెదిరింపులు, విధి నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande