
నిజామాబాద్, 20 జూన్ (హి.స.)
నిజామాబాద్ జిల్లాలోని మాధవనగర్ ఫ్లైఓవర్ ఆలస్యంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఫ్లైఓవర్ వద్ద సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన ఆయన దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. రైల్వే గేట్ వల్ల అంబులెన్స్ లలో ప్రాణాలు పోతున్నాయని అన్నారు. కమిషన్లు ఆపి వెంటనే పనులను పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలను అరవింద్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోతే బీజేపీ అనేక ధర్నాలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఫ్లైఓవర్ ను ప్రారంభించేలా చేశామన్నారు. ఈ ప్రాజెక్టులో సగం డబ్బులు కేంద్రానివి, సగం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానివి అని చెప్పారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10ఏళ్లు దీనిని పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నాయకులు పట్టించుకోవడంలేదని అన్నారు. నాయకులు ఏం ముఖం పెట్టుకున్నారని జిల్లాలో తిరుగుతున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటికే అర్మూర్ ఇతర ప్రాంతాల్లోని ప్రాజెక్టులను కేంద్రం పూర్తి చేసిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..