అన్ని ప్రభుత్వ చెల్లింపులు ఒకే వేదిక పై తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్యూ ర్ 1 మొబైల్ యాప్
అన్ని ప్రభుత్వ చెల్లింపులు ఒకే వేదిక పై తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్యూ ర్ 1 మొబైల్ యాప్
అన్ని ప్రభుత్వ చెల్లింపులు ఒకే వేదిక పై తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం  క్యూ ర్ 1 మొబైల్ యాప్


హైదరాబాద్, 20 జూన్ (హి.స.), హైదరాబాద్: అన్ని ప్రభుత్వ చెల్లింపులను ఒకే వేదికపైకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన క్యూర్-1 మొబైల్ యాప్ మెరుగైన నిర్వహణ, సైబర్ భద్రత, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్టీరింగ్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కమిటీ నెలకోసారి సమావేశం కావాలని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ సేవల విస్తరణకు చొరవ తీసుకోవాలని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ ఉత్తర్వులో స్పష్టం చేశారు. కమిటీకి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్గా, మీసేవ సంస్థ డైరెక్టర్ కన్వీనర్గా, విద్యుత్తు సంస్థ సీఎండీ కో-కన్వీనర్గా వ్యవహరించనుండగా జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు, జలమండలి ఎండీ, హైదరాబాద్ ట్రాఫిక్ సీపీ లేదా ఆయన సూచించినవారు, 3 కార్పొరేషన్ల ఐటీ విభాగాల అదనపు కమిషనర్లు సభ్యులుగా ఉంటారు.

కరెంటు, నల్లా బిల్లులు, ట్రాఫిక్ చలాన్లను కూడా ఇందులో చెల్లించవచ్చు. యాప్ను సీజీజీ(సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్) రూపొందించగా చెల్లింపుల వ్యవహారాలు, నిర్వహణ బాధ్యతలు మీసేవ సంస్థ ద్వారా జరగనున్నాయి. అందులో భాగంగా మీసేవను సర్కారు నోడల్ ఏజెన్సీగా నియమించింది. సమస్యలు, సవాళ్లను మీసేవనే పరిష్కరించాలని స్పష్టం చేసింది. తమ పరిధిలో ప్రజలు చెల్లించే రుసుములకు క్యూర్-1 యాప్ను ఉపయోగించుకోవాలని న్యాయ, హోమ్, విద్యుత్తు, తదితర శాఖలను కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande