కాంగ్రెస్ పాలనలో గ్రామాల అభివృద్ధి అస్తవ్యస్తం:ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
కాంగ్రెస్ పాలనలో గ్రామాల అభివృద్ధి అస్తవ్యస్తం:ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Mla


సిద్దిపేట , 20 జూన్ (హి.స.)

గత బీఆర్ఎస్ హాయంలోనే గ్రామాలు

అభివృద్ధి చెందాయని కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక మండలం హర్షీపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బాలెంల శ్రీలత రామచంద్రారెడ్డితో కలిసి రూ. 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ఎన్ఆర్జీఎస్ ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు.

. హర్షీపూర్ గ్రామానికి ఎన్ఆర్ఆజీఎస్ ద్వారా గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande