పేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
పేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
Mla


నాగర్ కర్నూల్, 20 జూన్ (హి.స.)

పేదలకు సొంతింటి కలను నిజం

చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మైసిగండి గ్రామానికి చెందిన విస్లావత్ తులసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి నూతన ఇంటిని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారుల అభివృద్ధికి భారీ నిధులతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే సుమారు 3,500 ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకోగా, రెండో విడతలో మరో 2,500 ఇళ్లను ఈ నెలాఖరులోగా మంజూరు చేస్తామని ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత గృహం అందించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande