
అమరావతి, 20 జూన్ (హి.స.)
అమరావతిలో ఆర్బీఐ సిబ్బందికి నివాస గృహ సముదాయం నిర్మించేందుకు ముందడుగు పడింది. ఆర్బీఐ, ఏపీసీఆర్డీఏకి మధ్య ల్యాండ్ అగ్రిమెంట్ పూర్తయ్యింది. సిబ్బందికి అమరావతిలోని ఐనవోలులో 4.04 ఎకరాలలో నివాస గృహాలను నిర్మిస్తారు. ఆ మేరకు ఒప్పంద పత్రాలను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ అధికారి వీసీ రూపకు సీఆర్డీఏ ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్ అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ