శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో!
శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో!
శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో!


తిరుపతి, 20 జూన్ (హి.స.)శ్రీకాళహస్తి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని ఊరందరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి చేపల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్తో పాటు క్లీనర్ గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంతో బొలెరో వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. వాహనంలో ఉన్న చేపల లోడు రోడ్డుపై చిందరవందరగా పడిపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande