రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు:
సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు:
Droupadi Murmu


అమరావతి 20 జూన్ (హి.స.)భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఆమెకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము సాగిస్తున్న ప్రజాప్రస్థానం, ప్రజాసేవ పట్ల ఆమెకున్న అంకితభావం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలకు ఎంతో స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన కొనియాడారు. రాష్ట్రపతి ముర్ము సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంతో వర్ధిల్లాలని, దేశ పురోగతి కోసం ఆమె అందిస్తున్న విశిష్ట సేవలు మరింత విజయవంతంగా ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆమెకు శుభాకాంక్షలు అందజేస్తున్నట్లు పేర్కొంటూ భగవంతుడు ఆమెకు సుదీర్ఘ ఆయుష్షును ప్రసాదించాలని ప్రార్థించారు. ఇదే తరుణంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రాష్ట్రపతికి ప్రత్యేకంగా జన్మదిన అభినందనలు తెలియజేస్తూ సందేశాలు పంపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande