ప్రభుత్వ ఉద్యోగులు బూత్ స్థాయి ఏజెంట్లుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు!
ప్రభుత్వ ఉద్యోగులు బూత్ స్థాయి ఏజెంట్లుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు!
హిమాన్షు శుక్లా


నెల్లూరు

, 20 జూన్ (హి.స.)భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఏ వ్యక్తి అయినా, బూత్ స్థాయి ఏజెంట్ (BLA)గా వ్యవహరించడానికి అనుమతి లేదని నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా బూత్ స్థాయి ఏజెంట్లుగా, నియమించబడినా లేదా, ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నా, వెంటనే ఆ కార్యకలాపాలను నిలిపివేయాలని సూచించారు.

ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించి బూత్ స్థాయి ఏజెంట్ (BLA)గా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులపై సంబంధిత చట్టాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి ఎన్నికల సంఘం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande