
అనంతపురం, 20 జూన్ (హి.స.): అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నగర్లో పర్యటించారు.
ప్రజలు సహకరించకుండా నగరంలో పరిస్థితులు మారే అవకాశం లేదని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన కొవ్వూరు నగర్ లో పర్యటించారు. అధికారులతో కలిసి ఎమ్మెల్యే రోడ్లపై చెత్త ఊడ్చారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికీ పరిశుభ్రతపై పోస్టర్లు అతికిస్తూ ముందుకు సాగారు. స్వచ్ఛ అనంత కోసం కట్టుబడి ఉంటామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో రోజు రోజుకీ జనాభా పెరుగుతోందని.. అందుకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేదన్నారు. గత ఐదేళ్ల వైసీపీ నిర్లక్ష్య పాలనలో డ్రైనేజీలు పట్టించుకున్న పాపాన పోలేదు. డ్రైనేజీలు పూడిక పేరుకపోయినా పట్టించుకోలేదన్నారు. అందుకే వీటన్నింటినీ పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. జనశక్తి నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో 30ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిస్తున్నామన్నారు. వంకలు, కాల్వల పై ఆక్రమణలు తొలగించి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV