విజయనగర రెండో దేవరాయల కాలం నాటి అరుదైన నంది శాసనం లభ్యం !
విజయనగర రెండో దేవరాయల కాలం నాటి అరుదైన నంది శాసనం లభ్యం !
విజయనగర రెండో దేవరాయల కాలం నాటి అరుదైన నంది శాసనం లభ్యం !


మార్కాపురం, 20 జూన్ (హి.స.)మార్కాపురం జిల్లా పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నల్లమల ప్రాంతశాసనాలపై జరుగుతున్న అధ్యయనంలో భాగంగా దోర్నాల మండలం బొమ్మలాపురం లోని నందిశాసనం గుర్తించబడి అరుదైన విషయం వెలికి వచ్చిందని శాసన పరిశీలకులు, సాహిత్యవేత్త డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలిపారు.

ఇటివల మైసూరుకు చెందిన భారతీయ పురావస్తు పరిశోధకశాఖ బృందం డైరెక్టర్ ఎం. మునిరత్నంరెడ్డి నేతృత్వంలో నల్లమల ప్రాంతశాసనాలను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. విజయనగర సామ్రాజ్య రెండో దేవరాయల కాలం నాటిదిగా పాలుట్ల శాసనాన్ని పురావస్తుశాఖ గుర్తించి అది కీ. శ. 1436 అక్టోబర్ 18తేదీ నాటిదని ప్రకటించింది.

కాగా, సరిగ్గా ఒక్కరోజు ముందరిదిగా బయల్పడిన బొమ్మలాపురం నందిశాసనం విజయనగర సామ్రాజ్య రాజుల ఘనతకు తార్కాణమైన చారిత్రక సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ శాసనం క్రీ.శ. 1436 అక్టోబర్ 17వ తేదీనాటిదిగా తెలుస్తున్నది. ఈ నందిశాసనం 79 వరుసల్లో చెక్కబడి ఉన్నదని, శ్రీపర్వత మల్లికార్జునస్వామి ఆలయ నిర్వహణ కోసం 400 వరహాలను బిక్షావృత్తి అయ్యంగార్ స్వామికిదానమిస్తునట్లు, అంతేకాక ఉదయగిరి రాజ్యంలోని మల్లాపురానికి చెందిన సనాతపురం, కాల్వపల్లి గ్రామాలను కూడా బహూకరించినట్లు ఈశాసనం తెలుపుతున్నదని శ్రీశైలం నడక మార్గంలో 20 కిలో మీటర్ల దూరంలో బయల్పడిన పాలుట్ల, బొమ్మలాపురం శాసనాలు కేవలం ఒక్కరోజు తేడాతోనే ఉండడం నాటి రాజుల అవిశ్రాంత ప్రయాణానికి దాతృత్వానికి దర్పణం పడుతున్నాయని డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande