
అమరావతి, 21 జూన్ (హి.స.)
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడఅందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేనని వ్యాఖ్యానించారు. యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటుతున్నారని కొనియాడారు. దేశాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారని ప్రశంసించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ