టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిర్మాత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిర్మాత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిర్మాత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత


హైదరాబాద్, 21 జూన్ (హి.స.)టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నేత గొట్టిముక్కల పద్మారావు (72) కన్నుమూశారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఇవాళ ఉదయం హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

కాగా, గొట్టిముక్కల పద్మారావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పద్మప్రియ ఆర్ట్స్ (Padma Priya Arts) అనే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థను స్థాపించి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించారు. సీనియర్ హీరో సుమన్తో ‘కంచు కవచం’ యాక్షన్ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘జోకర్’, నేటికీ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించే క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఏప్రిల్ 1 విడుదల’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పద్మారావు గారు అందించారు. దీంతో ఆయన మృతి పట్ల టాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నటులతో పాటు రాజకీయ నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande