ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
The highest rainfall in the last 24 hours was 2.91 inches in Galteshwar, Kheda.


కర్నూలు, 21 జూన్ (హి.స.)ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా రాష్ట్రంలో ఎక్కోడో ఒక చోట వర్షం కురుస్తూనే ఉంది. శుక్ర, శనివారాల్లో అయితే పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇక ఈరోజు సైతం రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా రాష్ట్రంలో ఎక్కోడో ఒక చోట వర్షం కురుస్తూనే ఉంది.

శనివారాల్లో అయితే పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇక ఈరోజు సైతం రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలకు తోడు ఏపీ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో భారీ నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు ప్రమాదం ఉందని హెచ్చరించింది. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, నెల్లూరు, రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గంటకు 50 నుండి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande