
బనగానపల్లె, 21 జూన్ (హి.స.)
బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగ అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సనాతన జీవన విధానమని పేర్కొన్నారు. వేల సంవత్సరాల క్రితమే భారత ఋషులు మానవాళి ఆరోగ్యం కోసం అందించిన ఈ మహోన్నత సంప్రదాయం నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందన్నారు. భారతదేశ ప్రతిపాదనతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు.
యోగా మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుంది..మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV