సీఎం విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్
సీఎం విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్
TN Chief Minister Vijay  in assembly


హైదరాబాద్, 22 జూన్ (హి.స.)

నేడు తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విశ్వనాయకుడు కమల్ హాసన్ ఆయనకు ఎక్స్ (ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

పుట్టినరోజును పురస్కరించుకుని కమల్ హాసన్ స్పందిస్తూ... లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న నా ప్రియ సోదరుడు, ముఖ్యమంత్రి విజయ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు, గతేడాది ‘థగ్ లైఫ్’తో మెప్పించిన కమల్ హాసన్... ప్రస్తుతం టాలీవుడ్ విజువల్ వండర్ ‘కల్కి 2’ షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. పార్ట్-1 ముగింపులో సుప్రీం యాస్కిన్గా కమల్ చూపించిన విశ్వరూపానికి కొనసాగింపుగా పార్ట్-2 లో ఆయన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది.

ఇంకోవైపు, ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మైండ్ బ్లోయింగ్ కాంబో ఎట్టకేలకు సెట్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్పై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande