కేంద్ర మంత్రి జార్జి కురియన్ రాజీనామా: మోదీ సలహా మేరకు ఆమోదించిన రాష్ట్రపతి
కేంద్ర మంత్రి జార్జి కురియన్ రాజీనామా: మోదీ సలహా మేరకు ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
కేంద్ర మంత్రి జార్జి కురియన్ రాజీనామా: మోదీ సలహా మేరకు ఆమోదించిన రాష్ట్రపతి


హైదరాబాద్, 23 జూన్ (హి.స.)కేంద్ర సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేయగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆ రాజీనామాను తక్షణమే ఆమోదించారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం జూన్ 21తో ముగియడం, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఆయనను తిరిగి నామినేట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జార్జి కురియన్ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖతో పాటు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల్లో సహాయ మంత్రిగా (MoS) సేవలందించారు. ప్రస్తుత నరేంద్ర మోదీ మంత్రివర్గంలో క్రైస్తవ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక మంత్రి ఈయనే కావడం గమనార్హం. 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచే కేరళలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయన, గతంలో జాతీయ మైనారిటీల కమిషన్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande