గాదె సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సి ఐ నాగరాజును.విచారించిన సిట్
గాదె సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సి ఐ నాగరాజును.విచారించిన సిట్
Gade


అమరావతి, 24 జూన్ (హి.స.)

గాదె సాయికృష్ణ కేసులోనిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సుదీర్ఘంగా విచారించింది. స్వయంగా ఐజీ రంగంలోకి దిగి నేరుగా ప్రశ్నించినప్పటికీ, సీఐ నాగరాజు(నోరు మెదపకపోవడం, సమాధానాలు చెప్పకుండా దాటవేయడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అతను మాయమవ్వడం వరకు సిట్ అధికారులు సీఐ నాగరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

‘సాయి కృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు ఎందుకు తీసుకొచ్చారు?. మిమ్మల్ని తీసుకొచ్చిన ప్రత్యేక బృందం సాయికృష్ణను మీకు అప్పగించి, దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ (రసీదు) కూడా తీసుకుంది కదా?. సాయికృష్ణను పోలీసుస్టేషన్లో అప్పగించినట్లు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. మరి అతడిని కోర్టులో ఎందుకు హాజరు పరచలేదు?. నాన్ బెయిలబుల్ వారెంట్ అమల్లో భాగంగా సాయికృష్ణను వెంటనే కోర్టుకు తీసుకెళ్లకుండా, స్టేషన్లో ఉంచి ఏం చేశారు?. పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను ఎందుకు డిలీట్ చేశారు?, ఎవరిని కాపాడటానికి ఆధారాలను ధ్వంసం చేశారు?. సాయికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి లాకప్లో విపరీతంగా కొట్టడం వల్లే అతను చనిపోయాడా?. ఒకవేళ సాయికృష్ణ లాకప్లోనే మరణిస్తే, అతని మృతదేహాన్ని ఏం చేశారు? ఎక్కడ దాచారు లేదా ఎక్కడ పడేశారు? చనిపోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు?’ అని సీట్ అధికారులు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలన్నింటికీ సీఐ నాగరాజు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కేసు మరింత మిస్టరీగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయడం, మృతదేహం ఆచూకీ లేకపోవడం వంటి అంశాలు లాకప్ డెత్ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈక్రమంలోనే సిట్ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande