బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్
MLA


హైదరాబాద్, 24 జూన్ (హి.స.)

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క

సుమన్కు బెయిల్ మంజూరైంది. రూ.25 వేలు, ఇద్దరి పూచీకత్తుతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సుమన్ను గతనెల 29న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతలతో జరిగిన ఓ సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. నిరసనలు తెలిపేందుకు కార్మికులు, రైతులు రావడంలేదని అవసరమైతే బీఆర్ఎస్ కార్యకర్తలు మిలిటెంట్ తరహా దాడులు చేయాలని పిలుపునిచ్చారు.

రోడ్ల మీదకు రావాలని, సింగరేణి ఆఫీస్ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేయాలన్నారు. సుమన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ నేతలు సుమన్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దేశద్రోహంతో పాటు సుమన్ పై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ చేసిన అనంతరం కోర్టు ఆదేశాలతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించగా 25 రోజుల పాటు జైలులోనే ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేలకు బెయిల్ లభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande