
రంగారెడ్డి, 24 జూన్ (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లతో పాటు రూ.6,40,000 వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతలతో కలసి ప్రారంభించారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 4 వార్డులో గడ్డమీది నందిత శ్రీశైలం,మల్గని లావణ్య శ్రీనివాస్ గౌడ్,గండు మల్లమ్మ,చామంతి యాదగిరి ఎల్లయ్య,చామంతి భాగ్యమ్మ బాలరాజ్,శేరి లక్ష్మమ్మ నర్సిహ్మ రెడ్డి ఇళ్లను 4 వార్డు కౌన్సిలర్ బక్కరెడ్డి మాధవి యాదిరెడ్డి కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ..... కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి పేద కుటుంబం సురక్షితమైన, శాశ్వతమైన గృహంలో నివసించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అలాగే 4వ వార్డులో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ సందర్భంగా మాట్లాడుతూ..., గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి రహదారులు కీలకమని అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..