ఆంధ్రప్రదేశ్ లో క్రీడ రంగం అభివృద్ధికి.రాష్ట్రప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్ లో క్రీడ రంగం అభివృద్ధికి.రాష్ట్రప్రభుత్వం చర్యలు
Ap


అమరావతి, 24 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో క్రీడా రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని యువజన సర్వీసులు, క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతిలో తాను నిర్వహిస్తున్న శాఖల్లోని రెండేళ్ల ప్రగతిని విలేకర్ల సమావేశంలో ఆయన వివరించారు. ‘క్రీడా శాఖని అత్యున్నత స్థాయికి కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది. క్రీడాకారులకు అన్ని కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. విజయనగరంలో స్టేడియంతోపాటు ఇండోర్ స్పోర్ట్స్ హాల్ని రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించాం. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించాం. ఖేలో ఇండియా పథకంతో ప్రభుత్వం క్రీడా మౌలిక వసతులు పూర్తి చేస్తుంది. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్స్ అందుబాటులోకి వచ్చాయి’.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande