చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పొదలపల్లిలో గంగా జాతరలో అపశృతి
చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పొదలపల్లిలో గంగా జాతరలో అపశృతి
చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పొదలపల్లిలో గంగా జాతరలో అపశృతి


చిత్తూరు జిల్లా, 24 జూన్ (హి.స.)

,:చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పొదలపల్లిలో జరుగుతున్న గంగ జాతరలో అపశృతి చోటుచేసుకుంది. జాతర సంబరాల్లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాస్తా కత్తిపోట్లకు దారితీసింది. పొదలపల్లి గ్రామానికి చెందిన గంగయ్య అనే వ్యక్తితో అదే గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి గొడవకు దిగాడు. ఈ విషయం గమనించిన గంగయ్య కుమారుడు ప్రకాశ్ అక్కడికి చేరుకుని ‘నా తండ్రితో ఎందుకు గొడవ పడుతున్నావు?’ అని బాబును నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన బాబు, ప్రకాశ్పై ఒక్కసారిగా దాడి చేసి, తన వద్ద ఉన్న కత్తితో పొడిచాడు.

కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన ప్రకాశ్ను స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ ఘర్షణతో పొదలపల్లి గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande