
హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
వేసవి సెలవులు ముగిసి ఇటీవలే మళ్లీ
బడిబాట పట్టిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు విద్యాశాఖ మరో తీపి కబురు అందించింది. జూన్ 26న మొహర్రం పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పాఠశాలలకు అధికారికంగా సెలవు (School Holiday) ప్రకటించాయి. తాజా ప్రకటనతో విద్యార్థులకు ఈ వారం వరుసగా సెలవులు రానున్నాయి. రేపు ఒక్కరోజు పాఠశాలలకు వెళ్తే.. ఆ మరుసటి రోజు శుక్రవారం హాలిడేను ఎంజాయ్ చేయొచ్చు.
ఇక శనివారం ఒక్కరోజు మాత్రమే స్కూళ్లు తెరుచుకోనుండగా.. తర్వాతి రోజు ఆదివారం ఎలాగూ జనరల్ హాలిడే ఉండనుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 25న కూడా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే (Optional Holiday)గా ప్రకటించింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా మొహర్రం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన కొద్దిరోజులకే పండుగ సెలవు రావడంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..