ఆగాపురా ప్రాంతానికి చెందిన షేక్ అస్లామ్ పోసి.రౌడీ షీట్.నమోదు
హైదరాబాద్, 24 జూన్ (హి.స.) : ‘నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు. జైలులో ప్రశాంతంగా ఉంటా. జైలుకు పంపించమని వారం రోజులుగా పీఎస్ చుట్టూ తిరుగుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదు. గొడవ చేస్తే పోలీసులు జైలుకు పంపిస్తారులే’ అంటూ ఓ రౌడీషీటర్ హోటల్లో
burglary


హైదరాబాద్, 24 జూన్ (హి.స.)

: ‘నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు. జైలులో ప్రశాంతంగా ఉంటా. జైలుకు పంపించమని వారం రోజులుగా పీఎస్ చుట్టూ తిరుగుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదు. గొడవ చేస్తే పోలీసులు జైలుకు పంపిస్తారులే’ అంటూ ఓ రౌడీషీటర్ హోటల్లో విధ్వంసం సృష్టించాడు. ఆగాపురా ప్రాంతానికి చెందిన షేక్ అస్లాం(22)పై రౌడీషీట్ నమోదైంది. అస్లాం మంగళవారం సాయంత్రం ఆగాపురా, చార్కందీల్లోని సెంట్రల్ హోటల్ బేకరీకి వచ్చి సిబ్బందితో గొడవపడ్డాడు. పాత్రలు, సిలిండర్లు బయటికి విసిరేసి కౌంటర్ అద్దాలు పగలగొట్టాడు. పోలీసులు అస్లాంను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఇతడిపై హబీబ్నగర్, సైఫాబాద్, సనత్నగర్, బేగంపేట హుమాయున్నగర్, ఇతర ఠాణాల్లో 13 కేసులు ఉన్నట్లు హబీబ్నగర్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande