తెలంగాణలో జనసేన జోరు... భారీ చేరికల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్
తెలంగాణలో జనసేన జోరు... భారీ చేరికల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్
Pawan Kalyan


హైదరాబాద్, 24 జూన్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై తన ఫోకస్ పెంచింది. తెలంగాణలో పార్టీ ఉనికిని చాటడమే కాకుండా, క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేసేందుకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాచరణ మొదలుపెట్టారు.రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఇతర పార్టీల నుండి వచ్చే వలసలను సమన్వయం చేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన 'తెలంగాణ జాయినింగ్స్ కమిటీ'ని అధికారికంగా నియమించారు. పార్టీ భావజాలానికి ఆకర్షితులవుతున్న విద్యావంతులు, సామాజికవేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు, తటస్థులను లైన్లోకి తెచ్చే బాధ్యతను ఈ ఏడుగురు సభ్యులకు అప్పగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande