తిరుమల ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు కి 11 లక్షల విరాళం
తిరుమల ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు కి 11 లక్షల విరాళం
Tirupati


తిరుమల, 25 జూన్ (హి.స.)

: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో ప్రతి రోజు వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తున్న ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం అందింది. బెంగళూరుకు చెందిన హైషానీ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఈ మొత్తాన్ని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందజేసింది. కదిరి ఎమ్మెల్యే కండికుంట వెంకటప్రసాద్, సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర, దాత కుటుంబసభ్యులు విరాళం డీడీలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరికి అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande