ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర? : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర? : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర? : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, 26 జూన్ (హి.స.)

బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్నుతన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్కుమార్ భద్రతను కుదించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవీణ్కు భద్రత తొలగించాలని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందా? ఇస్తే ఆ నివేదికను బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.కాగా, ఇటీవల కాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటున్నాడు. ముఖ్యంగా బండీ భగీరథ్ పోక్స్ కేసులో చురగ్గా పని చేశాడు. ఆయన మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో చట్టం లోని లోటుపాట్లపై అవగాహన ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వ చట్ట వ్యతిరేక విధానాలపై గళం విప్పుతున్నా డు. ఈ క్రమంలో ప్రభుత్వం కావాలనే ఆయన భద్రతను కుదించింది ఆనే ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande