
హైదరాబాద్, 26 జూన్ (హి.స.)
తెలంగాణ రిజర్వేషన్లను ( Reservations ) కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ (G Devi Prasad )అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మరోసారి ముల్కీ ఉద్యమం (Mulki movement ) వచ్చే అవకాశముందని హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత భుజంగ రావు , టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ , బీసీ కమిషన్ మాజీ సభ్యురాలు ఉపేంద్ర చారితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు
కాంగ్రెస్ సర్కార్ కొత్తకొత్త నిబంధనలు తీసుకు రావడం వల్ల తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 3 యేండ్లు తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ B tech చదివితే స్థానికులు ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణలో బీటె క్పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల వారు మొత్తం స్థానికులుగానే భావించాల్సి వస్తుందని వెల్లడించారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పల్లా నిషాంత్ కేసు తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందన్నారు. తీర్పు ఇచ్చిన జడ్జిని తప్పు పట్టడం లేదని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన వాదనలు వినిపించడంలో విఫలం చెందడం వల్లే సమస్య వస్తుందని వివరించారు. సాంకేతక సమస్యలతో ఆదిలాబాద్ కొమరం భీం జిల్లా లాంటి ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగాలు పొందలేక పోయారని వెల్లడించారు. ఈ అంశాలను గమనించి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కేసీఆర్ కృషి చేశారని , 1 వ తరగతి నుంచి 7 వ తరగతి వరకు తెలంగాణలో చదువుకున్న వారిని స్థానికులుగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివితే స్థానికులుగా గుర్తించడం లేదని పేర్కొన్నారు. స్థానిక అంశం తెలంగాణలో మళ్లీ అలజడులు జరిగేలా ఉందని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన రీతిలో కౌంటర్ దాఖలు చేయలేదని, జీఏడీ అధికారులు, చీఫ్ సెక్రటరీ సమావేశం నిర్వహించి దీని పై న్యాయ పోరాటం చేయాలని సూచించారు. లేకపోతే ముల్కీ రూల్ ఉద్యమం మళ్లీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి బీమా పథక సదుపాయం ఇప్పటికే ఉందని గుర్తుచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi