27 రోజుల జైలు నిర్బంధం తర్వాత.. కేటీఆర్ను కలిసిన బాల్క సుమన్
27 రోజుల జైలు నిర్బంధం తర్వాత.. కేటీఆర్ను కలిసిన బాల్క సుమన్
ktr


హైదరాబాద్, 26 జూన్ (హి.స.)

దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉన్న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ గురువారం సాయంత్రం చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదయింది. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసుల వల్ల ఆయన ఏకంగా 27 రోజుల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. కేటీఆర్ను కలిసిన సందర్భంగా... తన జైలు అనుభవాలు, తదుపరి న్యాయపోరాటం గురించి చర్చించారు. ఈ కష్టకాలంలో పార్టీ తనకు అండగా నిలిచినందుకు కేటీఆర్కు థాంక్స్ చెప్పారు. బాల్క సుమన్ను కేటీఆర్ ఆత్మీయంగా హత్తుకుని, ధైర్యం చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande