
అమరావతి, 25 జూన్ (హి.స.):హైదరాబాద్లో బసవతారకం ఆస్పత్రి ఇంకా విస్తరణ జరుగుతుందని ఆ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ )వ్యాఖ్యానించారు. అమరావతిలో కూడా బసవతారకం ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బాలయ్య నటిస్తున్న112వ సినిమా అమరావతి ఆసుపత్రి నిర్మిస్తున్నామని ఈరోజు (గురువారం) గ్రాండ్గా లాంచ్ అయ్యింది. ఈ మూవీ ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ ముఖ్య అతిథులుగా హాజరై.. క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.
జులైలో ఆస్పత్రి పనులు ప్రారంభమవుతాయని వివరించారు. 2028లో మొదటి దశ పనులు పూర్తి అవుతాయని చెప్పుకొచ్చారు. బసవతారకం ఆస్పత్రి నిర్మాణం కోసం వర్కర్లు పగలు, రాత్రుళ్లు కూడా కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. వర్షాకాలం కావడంతో పనులు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతోనే ఈ ఆస్పత్రి నిర్మిస్తున్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ