అమరావతిలో నిర్మాణంలో ఉన్న బసవతారకం ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు
అమరావతి, 25 జూన్ (హి.స.) తుళ్లూరు: అమరావతిలో నిర్మాణంలో ఉన్న బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను గురువారం సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్లో బసవ తారకం ఆస్పత్రి ఇంకా విస్తరణ జరుగుతో
Basavatarakam


అమరావతి, 25 జూన్ (హి.స.)

తుళ్లూరు: అమరావతిలో నిర్మాణంలో ఉన్న బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను గురువారం సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్లో బసవ తారకం ఆస్పత్రి ఇంకా విస్తరణ జరుగుతోంది. అమరావతిలో ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జులైలో పుట్టింగ్ పనులు మొదలు అవుతాయి. 2028లో మొదటి దశ పనులు అవుతాయి. నిర్మాణం కోసం వర్కర్లు పగలూ రాత్రి పని చేస్తున్నారు. వర్షాకాలం పనులు కొంత ఆలస్యం అవొచ్చు. ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో ఈ ఆస్పత్రి నిర్మిస్తున్నాం’’ అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande