
నెల్లూరు, 25 జూన్ (హి.స.)
నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. సోమశిల నుంచి వచ్చిన బస్సుకు బ్రేక్ ఫెయిల్ అవడంతో ప్లాట్ ఫామ్పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ