
అమరావతి, 25 జూన్ (హి.స.) తిరుపతి, న పాకాల, యాదమరి, చిత్తూరు గ్రామీpakakaణ: కూలీకి వెళితేనే వారికి పూట గడుస్తుంది.. ఆర్థిక స్తోమత లేకున్నా అందరూ కలివిడిగా ఆనందంగానే ఉండేవారు.. వివాహాలై మూడు మండలాల్లో స్థిరపడ్డా ఏ శుభ గాడికి కార్యానికైనా ఒక్కటిగా వెళ్లి తిరిగి వచ్చేవారు. బుధవారం కూడా అ అంతా సంతోషంగా బయలుదేరారు. చిత్తూరు గ్రామీణ, బంగారుపాళ్యం మండలాల నుంచి యాదమరి మండలం పెరుమాళ్లపల్లికి వచ్చి అక్కడి నుంచి ఆటోలో తిరుపతిలో పెళ్లికి పయనమయ్యారు. గంట ప్రయాణం తర్వాత పాకాల మండలం గాదంకి వద్దకు చేరుకున్నారు.. అటవీ శాఖ చెక్పోస్టు వద్ద ఒక్కసారిగా బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వెళుతోన్న లారీని ఆపాలని భద్రతా సిబ్బంది విజిల్ వేసి ఆపారు. ఆ వాహనం అకస్మాత్తుగా నిలిచింది. వెనుక వేగంగా వస్తోన్న ఆటో లారీని ఢీ కొట్టింది. అంతే అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందగా.. ఒకరు ఆసుపత్రిలో మరణించారు.. మరొకరు వైద్యశాలకు వెళ్లే క్రమంలో కన్నుమూశారు.. పెళ్లికి వెళ్లి సందడిగా గడపాల్సిన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం, ఏడుగురు గాయపడటంతో మూడు గ్రామాల్లో విషాదం నెలకొంది.
అమ్మ, చెల్లిని కోల్పోయి నిస్సహాయంగా
యాదమరి మండలం పెరుమాళ్లపల్లికి చెందిన బేబీ (50)కి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. యనమల మాధవి (37) చిత్తూరు మండలం ఏనుగుంట్లపల్లిలో ఉండగా మరో కూతురు చాముండేశ్వరి బంగారుపాళ్యంలో ఉంటున్నారు. కుమారుడు రాజశేఖర్ (25) జేసీబీ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. అవివాహితుడు. బేబీ కూలీ పనులకు వెళ్తోంది. ఆమె భర్త కూడా రోజువారీ కూలీకి వెళ్తున్నారు. మాధవి కుమారుడు సూరి.. చిత్తూరులో డిగ్రీ చదువుతున్నారు. కూతురు మేఘన (15) చిత్తూరు నగరంలోని సంతపేటలో పదో తరగతి అభ్యసిస్తున్నారు. గురువారం ఉదయం 7- 10 గంటల మధ్యలో రాయలచెరువు సమీపంలో జరుగుతోన్న బేబీ తమ్ముడి కుమారుడు రమణ వివాహానికి బుధవారం బయలుదేరారు. ఆర్థికంగా స్థితిమంతులు కాకపోవడంతో 11 మంది ఒకే ఆటోలో ప్రయాణమయ్యారు. రాత్రయితే ప్రయాణానికి ఇబ్బంది అని మధ్యాహ్నం పయనమయ్యారు. ఇంతలా జాగ్రత్త తీసుకున్నా ఒక్కసారిగా ఆగిన లారీ.. నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. డిగ్రీ చదువుతోన్న సూరి.. తల్లి, చెల్లిని ఒకేసారి కోల్పోవడంతో అతని ఆవేదనకు అంతే లేకుండా పోయింది. ఒకే కుటుంబానికి చెందిన బేబీ, ఆమె కుమారుడు రాజశేఖర్, కూతురు మాధవి, మనవరాలు మేఘన దుర్మరణం చెందడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ