
అమరావతి, 25 జూన్ (హి.స.)
సర్వేపల్లి( లారీని ఆటో ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం మనుబోలు పోలీసు స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. చెన్నూరు నుంచి మనుబోలు మండలం మడమనూరు సమీపంలోని రొయ్యల పరిశ్రమలో పనుల కోసం కొంతమంది కూలీలు ఆటోలో బయలుదేరారు. మార్గంమధ్యలో మనుబోలు పోలీసు స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. వీరు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్తోపాటు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో క్రమబద్ధీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ